Header Banner

సముద్రపు నాచుతో న్యూడిల్స్, బిస్కెట్లు, పాస్తా! ఏంటి షాక్ అయ్యారా! నిజమేనండోయ్..!

  Sun May 18, 2025 14:14        Others

సముద్ర నాచు ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సీ వీడ్ ఉత్పత్తులు, బిస్కెట్లు, పాస్తా, నూడుల్స్, సూప్ పౌడర్స్, జ్యూస్లు పరిచయం చేస్తున్నారు.

 

సముద్రంలో ఉండే నాచును ఆహారంగా తీసుకునే వారు చాలా మంది ఉన్నారు. జపాన్, చైనా, కొరియా, థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియాలో నాచుని రోజువారీ ఆహారంగా ఉపయోగిస్తుంటారు. ఇది పోషక విలువలతో కూడా అత్యంత ఆరోగ్యకరమైన ఆహార పదార్థమని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యం పై అద్భుత ప్రభావం చూపిస్తుందని చెబుతుండటంతో.. దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా సీ వీడ్ హవా నడుస్తోంది. దీన్ని నేరుగా తీసుకోకపోయినా బిస్కెట్లు, పాస్తా, నూడుల్స్ వంటి ఉత్పత్తులను తయారు చేసి విశాఖలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సీఐఎఫ్టీ) ప్రజలకు పరిచయం చేస్తోంది. దీనిపై ప్రజల్లో అవగాహనకు ఇటువంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నామని విశాఖపట్నంలోని కేంద్ర మత్స్య సాంకేతిక సంస్థ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా."మధుసుదన్ రావు" అంటున్నారు.

 

ఇది కూడా చదవండి: పెను విషాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి!

 

విశాఖలో ఐదేళ్లుగా సముద్ర నాచుపై కేంద్ర మత్స్య సాంకేతిక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది అంటున్నారు. సీవీడ్స్ లో సముద్రంలో ఆకుపచ్చ, ఎరుపు, మట్టిరంగులో ఇవి లభిస్తాయి. మన దేశంలో ఎస్క్రీమ్స్, కాస్మెటిక్స్ వీటిని ఉపయోగిస్తున్నారు. సీవీడ్ ను నేరుగా తీసుకోలేని పరిస్థితిలో బిస్కెట్లు, పాస్తా, నూడుల్స్, సూప్ పౌడర్స్ వంటి ఉత్పత్తులను విశాఖ కేంద్రంగా తయారుచేసి అవగాహన కల్పిస్తున్నారు. వీటితోపాటు సీవీడ్ జ్యూస్లు అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల 'సీవీడ్ ఫిల్మ్' తయారుచేశారు. దీన్ని ఉత్పత్తుల ప్యాకింగ్ మెటీరియల్ గానూ వాడుకోవచ్చు అని తెలుపుతున్నారు.

 

ఈ సీవీడ్ ని సముద్రపు కలుపు మొక్క గా కాకుండా ఆకుకూరగా భావించాలని ప్రతి ఒక్కరూ తినాలి అని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమిపై తోటకూర, ఇతర ఆకుకూరల్లో పోషకాలున్నట్లే సముద్రపు నాచులోనూ కూడా అదే విధంగా పోషక విలువలు ఉంటాయని అంటున్నారు. ఇందులో ప్రొటీన్, ఐరన్, కాల్షియం, కాపర్ విరివిగా ఉంటాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు ఏ, సీ, ఈ, కె విటమిన్లు ఉంటాయి. ఇది క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యానికి దోహదపడుతుంది అని అంటున్నారు.

 

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వయంశక్తి సంఘాలు ముందుకు వస్తే, సీవీడ్ తో ఆహార ఉత్పత్తుల తయారీపై శిక్షణనిస్తాం అంటున్నారు. కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సాంకేతికత అందుబాటులో ఉంది అంటున్నారు. అక్కడి మార్కెట్లు, సూపర్ బజార్లలో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి అంటున్నారు.

 

ఇది కూడా చదవండి: విశాఖ నుండి అక్కడికి డైరెక్ట్ వందే భారత్ స్లీపర్! రూట్లు ఏంటో చూడండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SeaweedFoods #HealthyEating #PlantBased #NaturalIngredients #Superfood #EcoFriendlyFood